మంచిపాలనకు పాటుబడదాం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పగలురాత్రులు పాటుబడి 
పొలాల్లో సకుటుంబంగా పనిచేస్తు
పంటలుపండిస్తున్న 
కర్షకుల సంక్షేమరాజ్యంకొరకు పాటుబడదాం

కండలను కరిగించి
అన్యాయాలను ఎదిరించి
కష్టజీవులను కాపాడటానికి
కార్మిక క్షేమపాలనకు పాటుబడదాం

రక్తాన్ని స్వేదంగామార్చి
రాజకీయనాయకుల భరతంపట్టి
రాజ్యాధికారాన్ని హస్తగతంచేసుకోవటానికి
రామరాజ్యంకొరకు పాటుబడదాం

చేతులను సద్వినియోగపరుస్తు
చిన్నారులను చేరదీసి
భావిపౌరులుగా తీర్చిదిద్ది
భారతదేశాన్ని బాగుచేయటానికి పాటుబడదాం

మనసులను మదించి
మంచి ఆలోచనలను పారించి
మహత్కార్యాలను చేయటానికి
మరోప్రపంచాన్ని సృష్టించటానికి పాటుబడదాం

కళ్ళతో కాంచి
నిజాలు తెలుసుకొని
అక్రమార్కులను ఎదుర్కొని
అవినీతిరహిత సమాజస్ఠాపనకు పాటుబడదాం

ప్రబోధగీతాలు పాడుతూ
పేదలను ఐక్యంచేస్తు
హక్కుల సాధనకు యత్నిస్తు
సంక్షేమరాజ్యాన్ని ఏర్పాటుకు పాటుబడదాం

కలాన్ని కత్తిలా చేతపట్టి
కుర్రకారుని చైతన్యపరచి
కల్మషాన్ని కడిగిపారేయటానికి
కవితలతో ప్రజలను కదిలిద్దాం

చేయీచేయీ కలుపుదాం
మంచిపాలనకు పాటుబడదాం
అభివృధ్ధిని సాధించుదాం
మార్పును స్వాగతిద్దాం


కామెంట్‌లు