సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 తరిగేవీ...పెరిగేవీ..
*******
రోజులూ, సంవత్సరాలూ గడిచేకొద్దీ వయసూ, సొగసూ తరిగిపోవడం చాలా చాలా సహజం.
కటిక మృత్యువును పేదవారైనా,కోట్లకు పడగలెత్తిన వారైనా తరిగిపోయే వాటి నుండి తప్పించుకోనూలేరు.
తరలి వచ్చే ముదిమిని, మృత్యువును ఆపనూ లేరు.
కానీ తరిగిపోయే జీవితంలో పెరిగేవీ,పెంచుకునేవీ ఉన్నాయి.అవి మనిషిని మనీషిగా చేస్తాయి,
ఈ భూమి మీద వ్యక్తి చిరునామాను  చెరిగిపోనివ్వకుండా శాశ్వతంగా ఉండేలా చూస్తాయి.
అవే.. మంచితనం, మానవీయ విలువలు.అవే తరిగిపోకుండా  పెంచుకునే అసలైన సంపదలు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు