ఓటుపాట్లు -డా.అడిగొప్పుల సదయ్య
రాజకీయునకు నువ్వు
రంజైన ఓటరు
ఎన్నికల వేళలో
నీమాటను దాటరు

నీ దగ్గరి ఓటు కొరకు
వేస్తారు గాలము
నీ ముందర శునకమై
ఊపుతారు వాలము

ఎన్నికలప్పుడె నువ్వు
అవ్వుతావు దైవము
ఫలితాలు వచ్చినాక
పనికిరాని దయ్యము

ఓటు కొక్క రేటు కట్టి
ఇస్తాడు కోటరు
గెలిచాక గద్దెనెక్కి
తిప్పుతాడు మీటరు

కులముల కూటమిపెట్టి
చల్లుతాడు వరములు
జనముల మనసులు చెరచి
చీల్చుతాడు తరములు
-----------------------
కవనశ్రీ చక్రవర్తిడా.అడిగొప్పుల సదయ్యజమ్మికుంట, కరీంనగర్9963991125


కామెంట్‌లు