అమ్మతో బుజ్జాయి ;-ఎం. వి. ఉమాదేవి
అమ్మతో బుజ్జాయి 
బుజ్జాయి నవ్వోయి 
నవ్వుతూ లాలనే పోసుకొను ఓ వనజ !

నూనెనే పట్టించు
పట్టిమరి మర్ధించు 
మర్ధనా వ్యాయామమొనరించు ఓ వనజ !

ఆటగా తలచేరు 
తలచి స్పర్శను  కోరు 
కోరుతూ ఓపికగ శిశువుండు ఓ వనజ !

ఉదయమ్ము సూరీడు 
సూరీడె చందురుడు 
చందమామగ బిడ్డ ఆతల్లి కే వనజ !

దినదినము పెరిగేను 
పెరిగి యలరించేను 
అలరించి గృహమంత వెలుగవ్వు ఓ వనజ !

చురుకుగా కాల్జేత 
కాల్జేత కదిలింత 
కదిలించి కేరింత కొట్టేరు ఓ వనజ !

కాళ్ళపై పండేసి 
పండేసి రుద్దేసి 
రుద్దగా శుభ్రపడు సునుబిండితో వనజ !


కామెంట్‌లు