చల్లని పలుకులు;-విజయకుమారి;-కలం స్నేహం:
అమ్మ పసినాట తీర్చిదిద్ది నేర్పేనే ముద్దుగా 
తీపిగొనగ పనస తొనలాంటి పలుకులుమన 

నోరు చల్లని చక్కని మాటల భాండాగారం
సారవంతమైన మనో భూమిలో ఎంచి 
మంచి విత్తనాలు నాలుగు విత్తినచో ఆచెట్టు .
ఏపుగెదిగి ఆశాఫల పుష్పాలనొడి నింపు

ఓనాలుగు మాటలు మంచి ముత్యాల 
మూటల చెలువములై  సేదదీర్చునుగా
అయోమయంతో దిక్కుతోచని స్థితిలో 
మనసు స్తబ్దతతో ఆలోచించే శక్తికోల్పోయి 

నిరాశా నిస్సత్తువతో  ప్రాణాలు డస్సి
గాఢాను భూతినుండ  హఠాత్తుగా 
ఓచేయి నీభుజం తట్టి నీకంట నీరుతుడిచి 
నేనున్నాని స్నేహ పరిమళమందించగా

ఆ ఓదార్పు తటిల్లతల చల్లని చలివేంద్రంలో
దప్పి తీర్చుకొనగా తిరిగి ఊపిరి అందినట్టు
స్వాంతన చేకూరి నరనారాన శక్తిపుంజుకొని
జీవితేచ్చతో బతుకు పయనం సాగించు

చెరపకురా చెడేవని చీడపనులతో ప్రవర్తించ
మంచి మాటలు ఎదుటి వారితో పాటు
మనని కూడ ఉద్దరిoచి ఉత్తేజాన్ని నింపు 
మంచి మనిషిగా మార్గ దర్శనo జుపు


కామెంట్‌లు