ఉగాది శుభాకాంక్షలు; - *సాహితీవేత్త -డా. చిటికెన కిరణ్ కుమార్*

   ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఉగాది పర్వదినాన్ని ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ( సాహితీవేత్తలకు ప్రత్యేకంగా ) శుభకృత్ నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా  చిటికెన మాట్లాడుతూ.... ప్రతి సంవత్సరం ఉగాది నుండి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుందని కనుక ఇది తెలుగువారి మొదటి పండుగని ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తే సకల శుభాలు జరుగుతాయని అందరి నమ్మకం. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని తెలుగువారు ప్రత్యేకంగా తయారు చేసి స్వీకరిస్తారు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని  సాహితీవేత్తలు  కవులు,రచయితలు తమ రచనల ద్వారా మరింత సమాజాన్ని చైతన్యం చేయాలని, తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్  నామ సంవత్సర ఉగాది సంవత్సరంలో  మరిన్ని శుభాలు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.

కామెంట్‌లు