బోలెడు (బాలగేయం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బోలెడు బోలెడు బోలెడు 
నింగిన ఉన్న చుక్కలు బోలెడు 
నేలన ఉన్న మొక్కలు బోలెడు 
కంకిన ఉన్న మక్కలు బోలెడు 
వాగులొ ఉన్న ఇసుక బోలెడు
సూర్యుడిలో కిరణాలు బోలెడు 
లెక్కల్లోని సంఖ్యలు బోలెడు 
చదువుల్లోని సారం బోలెడు  
బోలెడు బోలెడు బోలెడు !!

కామెంట్‌లు