సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
అద్దం.. అర్థం...
******
మనమెలా ఉన్నామో చూసుకోవాలన్నా, ఇతరులను అర్థం చేసుకోవాలన్నా అద్దం తప్పకుండా కావాలి..
మన ముఖాన్ని, దేహాన్ని మాత్రమే చూపించే అద్దం ఒకటైతే..
మన మనసును ఉన్నది ఉన్నట్లు చూపించే అంతరంగమనే అద్దం మరొకటి.
మొదటిది పై మెరుగులు చూపిస్తే, రెండవది లోలోపలి లొసుగులు, అసలైన మనిషితనాన్ని చూపిస్తుంది...
అందుకే ముఖం, మనసు నిత్యం తేజోవంతంగా ఉండాలంటే అద్దంతో  స్నేహం చేయాల్సిందే..
 ఇక అర్దం... ఇతరులను అర్థం చేసుకోవాలి అంటే వారిని మన అంతరంగమనే అద్దం ముందు నిలిపి చూడాలి. అప్పుడే వాళ్ళేమిటో అర్థం చేసుకోగలం.
అర్థం చేసుకోవాలన్న , అర్థవంతంగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నా అద్దం అవసరమే..
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు