నవోదయ ఉగాదికి స్వాగతం;-పి. పద్మావతి
నిరాశా నిస్పృహలకు ఆలవాలమై
హృదయ విదార వినాశకమై
దారుణ మారణకాండకు నిలయమై
హింసా ద్వేష భావాల నిలయమై
భీకర ప్రళయ మరణ మృదంగమై
ఫలించని ఆకాంక్షల గమనమై
నిరాశా నిస్పృహలతో స్తబ్ధమై
విలపించు మానవాళికై...

తొలి ఉషోదయ అరుణ కిరణ చైతన్యమై
అంతరంగాల ఆశల చిరుదివ్వెవై
ఊహలకు మధురిమల నందించే రూపమై
పికముల స్వర లహరుల రాగంలా
గువ్వల కలకలముల సంధ్యా రాగమై
మమతానురాగాల సంగమమై
సుమ వికసిత బృందావనమై
శాంతీ స్వేచ్ఛా స్వాతంత్ర్య సమరమై
శుభక్రతువులే మానవజాతికి శుభకృతు శోభల వెలుగులు నందింస్తూ
తెనుంగుల మదిలో తేనెల మధురిమలనే అందించు నవోదయ
నవయుగానికి ప్రారంభమై అరుదెంచే
        శుభ వేళకు స్వాగతం
               సుస్వాగతం


కామెంట్‌లు