ఎండాకాలం సమస్యలు.; పి . కమలాకర్ రావు ,

 ఎండతాకిడి వల్ల ముఖంపై నున్న
సున్నితమైన చర్మం కమిలిపోయి
నల్లబడుతుంది. భరించడం
కష్టంగా ఉంటుంది. దీనికి కారణం
అతినీలలోహిత కిరణాలు ( Ultra Voilet Rays) సోకడం.
అలాంటప్పుడు ముఖాన్ని చల్లని
నీటితో కడుక్కుంటే కొంత ఉపశమనం గా ఉంటుంది. కానీ అది శాశ్విత పరిష్కారం కాదు.
 కొద్దిగా మెత్తగా పొడిచేసిన సెనగ
పిండిలో కొన్ని చల్లని పాలు, కొద్దిగా,ఉల్లిగడ్డల రసం, గంధం పొడి, మెత్తని అతిమధురం (Muleti )
పొడి కొద్దిగా నిమ్మరసం, తాజా
పన్నీరు కొద్దిగా చివరగా బొప్పాయి
పండు గుజ్జు, ఇవన్నీ బాగా కలిపి
గిల కొట్టాలి. ఇప్పుడు తయారైన
మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
ఓ 20 నిమిషాల తరువాత చల్లని
నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ఇలా ఎండాకాలంలో అప్పుడప్పుడు చేస్తే నలుపెక్కిన ముఖం తెల్ల బడుతుంది. నల్లని
మచ్చలు కూడా పోతాయి.
ముఖం నిగ నిగ లాడుతూ మెరిసి
పోతుంది. ఇది ఆరోగ్య కరమైన
తక్వ ఖర్చు తో  కూడిన face pack. బయట Beauti Parlour
కు వెళ్లకుండా ఇంట్లో చేసుకోవచ్చు.

కామెంట్‌లు