హరివిల్లు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 వర్షం వర్షం - పగలే వర్షం
ఎండ కాసెను - వర్షం కురిసెను 
తూరుపు దిక్కున - సింగిడి మొలిచెను 
ఆటల పాటల - బాలలందరు
ఆటలు ఆపిరి - పాటలు ఆపిరి
ఆశ్చర్యముగా - చూస్తూ ఉండిరి
మబ్బులపైన - ఉన్నది చూడు
ఇంద్రుని ధనువు - అదిగదిగదిగో
ఏడు రంగుల - హరివిల్లదిగో 
నింగినుండి - నేలకు అంటెను
అదిగో అదిగో - అదిగదిగదిగో !!

కామెంట్‌లు