మిడిమిడిజ్ఞానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మూడోక్లాసు చదివే లంబు జంబు అక్కయ్య లేనప్పుడు కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నారు."ఒరే లంబూ! ఆమౌస్ ని ఇలా జరుపు".జంబూకేకకి  ఇంట్లో ఉన్న పుస్సీ ఉలిక్కిపడితలెత్తింది. ఆపిల్లిపిల్ల ఈమధ్యనే ఆంగ్లం నేర్చుకుంటున్నది.మౌస్ అంటే ఎలుక చిట్టెలుక గదూ?వారి చేతులకి చిక్కింది కాబోలు!పాపం దాన్ని బంతిలాగా బల్లపైన అటుఇటు జరుపుతారు కాబోలు!"జంబూ!సైబర్ కేఫ్ కి వెళ్దామురా!మన కంప్యూటర్ చెడిపోతే నాన్న వీపు విమానం మోత మోగిస్తాడు. "నాన్న కంఠం వినపడటం తో  ఇద్దరు గప్చిప్ స్థంభారుబుడ్డిలా చల్లగా బైటికి జారుకున్నారు.పుస్సీకికూడా సైబర్కేఫ్ కి వెళ్ళాలనిపించింది.అక్కడ బోలెడు కంప్యూటర్లు ఉంటాయని  కోతి బావచెప్పాడు.ఎంచక్కా రోజు కొక్కమౌస్ ని గుటకాయస్వాహా చేయొచ్చు. అనే ఆలోచన తో ఆపిల్లల వెనకే  అలుకుడుసేయక నడవసాగింది.కేఫ్ లో ఓమూల నక్కింది."గంటకి 20రూపాయలు"అక్కడ ఉన్న అబ్బాయి అనటంతో"చెరో అరగంట ఆడుతాం"అని 20రూపాయలు అతని చేతిలో పెట్టారు. వారి ఆటలుచూస్తూ పుస్సీ గుడ్లప్పగించి పరిసరాలు మరచిపోయింది.ఎప్పుడు లంబూజంబూ ఆకుర్రాడు షట్టర్ వేసుకుని వెళ్లారో గమనించక కునికిపాట్లు పడింది. హఠాత్తుగా మెలుకువ రాగానే భయంతో ఆలోచిస్తోంది "ఎలా బైట పడాలిరా దేవుడా!"అనుకుంటూ!ఆపైకప్పు కన్నంలోంచి బిన్నీ అనే కోతి పిల్ల లోపలికి ఛెంగున దూకింది."బిన్నీ!నేను పుస్సీని.ఇక్కడ మౌస్ లు చాలా ఉంటాయి తిందామని వచ్చాను." "ఓస్ పిచ్చి దానా! మౌస్ అంటే నీవు తినే ఎలుక అని  సంబరపడుతున్నావా? మౌస్ అంటే ఇది"అని కంప్యూటర్ దగ్గర ఉన్న మౌస్ ని అటుఇటు జరిపింది."అయ్యోరామ!బిన్నీ  నీవు పైకప్పు దాకా ఎగిరి పోగలవు.నా గతేమిటి?" భోరుమంది పుస్సీ!"మరే మిడిమిడిజ్ఞానంతో ఇంగ్లీషు అర్ధం అవుతుంది అని డబ్బా కొట్టావు కదా?మంకీ కొంకీ !ఏంచేస్తావే పెంకీ?"అని  నన్ను ఏడిపిస్తావుగదా? ఇంద ఈరొట్టె ముక్క తిను.రేపు షాపు కుర్రాడు వచ్చి తెరిచేదాకా నీగతి అంతే!" అని బిన్నీ  కిచకిచలాడుతూ దూలంపైకి ఎగిరి కప్పు రంధ్రం గుండా బైట పడింది. మిడిమిడిజ్ఞానం తో  ఏమీతెలుసుకోకుండా ఏపనిలోను వేలు పెట్టరాదు.దురాశ దు:ఖానికి చేటుగూడా🌷
కామెంట్‌లు