* ఆకాశ వారసురాలు *;- కోరాడ నరసింహా రావు
ధరిత్రీ దినోత్సవ ప్రత్యేక కవిత 
 ******
ముత్తాత,తాత,తండ్రుల వార సత్వంతో...జలకన్యకు పుట్టిన ముద్దుల ముని మనుమరాలీ మన ధరిత్రీమాత!

   సంపూర్ణ సమగ్ర శక్తుల పూర్ణ రూపి ఈ నేల తల్లి !
   క్రిమి, కీటక, పశు, పక్ష్యాది... 
సకల ప్రాణికోటినీ కని, పెంచి, పోషించి...చివరకు తనను  వీడి పోనీక తనలోనే దాచుకునే 
మాతృమూర్తి మనజనని !

అందాలతొ అలరిస్తూ.. 
 రంగులతో కనువిందులుచేస్తూ 
రుచులతో నోళ్ళూరిస్తూ.,ఆకలి
దప్పులను   వాత్సల్యమున దీర్చు తు...హాయిని గొలిపేబ్రతుకుల నిచ్చి... సుఖముగా  బ్రతకండ ని  అంటే..., 

  గుండెలవంటి  కొండలన్నిటిని గుండ,పిండిగజేసేస్తూ ,చెట్టూచేమలతుదముట్టిస్తూ...ఎక్కినకొమ్మనెనరుకుచందమున...నేలను,నీటిని,గాలితోసహా...అమ్మనుకాలుష్యరక్కసికిఅప్పగిస్తిమి !

పాలు తాగి, రొమ్ముగుద్దు బిడ్డ లజూసి,ఆగ్రహించిననేలతల్లి 
  అణువణువూ మండగా... 
అలమటించు చుంటిమి కద...
నేటికి మనమందరం !
  
తప్పుతెలిసి,కళ్లుతెరచి,పస్చా త్తాపముచెంది...,తప్పులు సరి దిద్దుకొనగ... కదలుదాము అం దరం ! అమ్మను ఆనంద పరచి 
మనము సుఖ, సంతోషాలతొ 
బ్రతుకుదాం కలకాలం  !
   ******

కామెంట్‌లు