దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులెక్కడాకులమతాల కుమ్ములాటలో చిక్కుకున్న మనమెక్కడరక్తం చిందించి స్వాతంత్య్రం తెచ్చిన నేతలెక్కడపదవుల కోసం పాకులాడే పాలకులే ఇక్కడదేశభక్తి అంటే జెండా పట్టి ఫోటోలు దిగడం కాదుసెలవు రోజని మురిసిపోవడం కాదుమనం బతకడానికి ఎందరో చేసిన బలిదానాలుజాతి భవిత కోసం ఉరి కొయ్యపై నిలబడ్డ ధైర్యసాహసాలుబుద్ధుడు, వివేకానందుడి స్ఫూర్తి మాటలుగాంధీజీ, కలాం వేసిన ఆశయ బాటలుగుర్తు తెచ్చుకో ... నిన్ను నువ్వు ప్రశ్నించుకోనీ ప్రతీ శ్వాస రేపటి వెలుగుల కోసం కావాలినీ ప్రతీ అడుగు దేశ భవిత కోసం అయ్యుండాలినీ ప్రతీ కదలిక దేశ ఔనత్యాన్ని చాటాలిఅదే నిజమైన దేశభక్తిభారతీయులుగా సగర్వంగా జీవిద్దాంవందేమాతరం అంటూ నినదిద్దాందేశ గౌరవాన్ని కాపాడుదాం
మారదాం - మార్చుదాం;- మంజీత కుమార్ బెంగళూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి