సునంద భాషితం;-వురిమళ్ల సునంద,ఖమ్మం
  వాడుకోవడం--వేడుకోవడం
*******
 కొందరికి మనమంటే ఇష్టమో,గౌరవమో,అభిమానమో,భయమో,భక్తో తెలియదు కానీ మనకోసం ఏపనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అలాంటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని అవసరాలకు అతిగా వాడుకోకూడదు.
ఒకానొక దశలో వారిలో అంతర్మధనం మొదలైతే వారి ముందు చాలా చులకనై పోతాం.
అలాగే మనకు  బాగా ఇష్టమైన వారి నుండి ప్రేమ,అనురాగం,ఆత్మీయతా అభిమానాలు కావాలని మాటలు,చేతల ద్వారా ఎప్పుడూ వేడుకోవద్దు.
ఈ బలహీనతల వల్ల మరింత చులకనై వారి అవసరాలకు,ఆనందాలకు పావులుగా మారుతాం.
కాబట్టి  వాడుకోవడం, వేడుకోవడం రెండూ శృతి మించకూడదు. అవి మేలు కంటే కీడునే ఎక్కువగా కలిగిస్తాయి.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు