ఓ జ్ఞాపకం ;-- యామిజాల జగదీశ్
 ఆమధ్య 
ఓ రోజు ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే ఓ పాత పుస్తకంలో ఎప్పుడు ఉంచానో తెలీదు.... ఎందుకుంచానో తెలీదు....
ఈ యాబై రూపాయల నోటు 
పాతదొకటి కంట పడితే
నేను పొందిన ఆనందం ఎంతని చెప్పను?
ఇరవై రెండేళ్ళ క్రితం ఓ మాసపత్రికలో ఓ పేజీ కథ రాస్తే ఇరవై అయిదు రూపాయలిస్తూ ఆ పత్రిక సంపాదకుడు "జగదీశ్ గారూ! ఇరవై అయిదు రూపాయలేనా అని చిన్నచూపు చూడకండి. వీటితో టొమాటాలొస్తాయి...మీకిష్టమైన అరటిపళ్ళు కొనొచ్చు..." అని అన్నప్పుడు అవునండి అన్నాను. 
అప్పుడా మాట నాతో చెప్పింది మధురాదర్ గారనే రచయిత.
ఆయన చెప్పినట్టే ఓ మూడు అరటి పళ్ళు, కాసిని టొమాటాలు కొన్నాను. 
మధురాదర్ గారు ఏ శుభముహూర్తాన రాయించారో కానీ ఆ బుజ్జాయి మాసపత్రికలో పంతొమ్మిదన్నరేళ్ళపాటు ఎక్కడా బ్రేక్ పడకుండా రాశాను. 
ఆయనకు, పత్రిక యజమాని బుజ్జాయి అప్పారావుగారికి వందనాలు!!
ఆ సంఘటన గుర్తుకొచ్చింది ఇప్పుడీ యాభై రూపాయలు చూసినప్పుడు. 

కామెంట్‌లు