శరణాగతి ధరత్రీమాత; -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-:- విశాఖపట్నం
అంశం:- ధరిత్రి దినోత్సవం ( ఏప్రియల్ 22)
---------------------------------------------------------------
కన్నతల్లి  నవమాసాలు మోస్తుంది
పుడమితల్లి జీవితాంతం భరిస్తుంది.
జన్మనిచ్చిన తల్లి లాగే
ధరణి తల్లి కూడా త్యాగమయి.
నీ శరీరపోషణకు అవసరమైన
పదార్ధాలను ఇచ్చి
నీవు విసర్జించిన మలినాలను తనలో కలుపుకుని
బదులుగా నీవు బ్రతకడానికి పచ్చని చెట్లను
పరిశుద్ధమైన గాలిని,
స్వచ్ఛమైన నీటిని ఇస్తే
స్వార్థంతో, సంకుచిత భావంతో,అన్నీ నేనే, అంతా నావే అని పుడమితల్లి పొరలను
చివరి వరకు చీల్చి బహుళ
అంతస్థుల భవనాలను 
హానికర వాయువులను వదిలే పరిశ్రమలను,
భయానక వ్యాధి ని కలిగించే ప్లాస్టిక్ పదార్థాలను  నిర్మించి తయారు చేసి
నేటి భూతాపానికి, సునామీలకు,ఉప్పెనలకు
కారణం నీవే అని తెలుసుకుని ధరత్రిని కాపాడుకుని ,పర్యావరణ
పరిరక్షణ చేసి" వృక్షో రక్షతి రక్షితః' అన్న బహుగుణ, మేధా పాట్కర్ ల జాడల్లో నడుద్దాం. ఆరోగ్య ముగా జీవిద్దాం.......!!
.................................
లోకా సమస్తా సుఖినో భవంతు.
...............................


కామెంట్‌లు