పాపాయి (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మా బుజ్జి పాపాయి
మా మంచి పాపాయి
మారాము చేయదు
మూలకూర్చోదు
బొమ్మలకు అమ్మను
తానె అంటుంది
బొమ్మలను ఎవరికీ
ఇవ్వనంటుంది
నేస్తాలతో ఇల్లు
నింపుకుంటుంది
అల్లరే చేయదు
ఆడుకుంటుంది!

కామెంట్‌లు