మనకుపుట్టగొడుగుల్లా
ఇప్పటికే గుర్తుపెట్టుకోలేనన్ని
రాజకీయ పార్టీలతో
జనం విసిగి పొతున్నారు !
ఇంకా కొత్త పార్టీలు పెడతానంటే
ప్రజలు ఈసడించుకుని
తరిమి తరిమి కొడతారు!
ప్రజలకు కావలసింది
కొత్త పార్టీలు కాదు,
ప్రగతిని అందించే,
కొత్త మార్గ దర్శకాలు!
ప్రజల మీద
అజమాయిషీచేసే
పార్టీలుకానేకాదు,
అవసరానికి-
అక్కున చేర్చుకునే
ప్రజానాయకులు కావాలి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి