అరుదైన పుస్తక సంకలనం.. అవార్డు సొంతం*;-వెంకట మొలక ప్రతినిధి: వికారాబాద్
 - సంగం లక్ష్మీబాయి విద్యార్థుల మణిపూసల సంకలనం "వికారాబాద్ విద్యార్థి మిణుగురులు
- 252 మంది ఎస్.ఎల్.బి విద్యార్థినుల కవితా సంకలనం
- వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం
- Deo రేణుకాదేవి చేతుల మీదుగా బహుకరణ
వికారాబాద్:


జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి సంగం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల కు చెందిన 252 మంది విద్యార్థినిలు రచించిన మణిపూసల కవితా సంకలనం వికారాబాద్ విద్యార్థి మిణుగురులు అనే కవితా సంకలనానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు దక్కింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పాఠశాలలో నిర్వహించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డు అనే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారి రేణుకాదేవి హాజరై " వికారాబాద్ విద్యార్థి మిణుగురులు" అనే కవితా సంకలనాన్ని అభినందించారు. కవితలు రాసిన విద్యార్థినులను అభినందిస్తూ ఆశీస్సులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు పరిజ్ఞానానికి, సాంకేతిక సాహిత్యానికి పెట్టింది పేరు అన్నారు. విద్యార్థినిలు సాహితీవేత్తలు రచయితలు కవులు ఎదిగి తెలుగు సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ మేడం గోపిశెట్టి రమణమ్మ గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రికార్డు ఆసియా ఖండం ఇంచార్జ్ బింగి నరేందర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాలగొప్ప గొప్పవారి అవార్డులను అందజేశామని, ఇలాంటి చిన్నారులకు అరుదైన అవార్డు దక్కడం వండర్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఇదొక రికార్డు అని అన్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ రమణమ్మను సన్మానించి గౌరవించారు. రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు మాస్టారు అంజిలప్పకు అందజేశారు. మణిపూసలు కవితా సంకలనం చేసిన విద్యార్థులు అలాగే 19 మంది మణిపూసల కవితాసంకలనం పుస్తక రూపకర్తలైన విద్యార్తినులను
లను అభినందించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, ప్రముఖ న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు విజయలక్ష్మి, మణిపూసలు సృష్టికర్త వడిచర్ల సత్యం, మొలక ప్రతినిధి వెంకట్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు