ఉగాది పాట! అచ్యుతుని రాజ్యశ్రీ
వచ్చిందీ వచ్చిందీ 
కొత్త వత్సరం!కొత్త సంవత్సరం!

గతాన్ని మరచీ చీకుచింతలు విడిచి!
కొత్త ఆశయాలతో కలలనురేపుచూ

ఒక్కొక్క ఏడూపెరిగే
వయసు జ్ఞానం పెరిగే
మనతోటే మంచితనం పెరగాలి 

కష్టసుఖాలు కలిమిలేములు
రేయింబవళ్లు కావడికుండలు
బంగరు భావికి వేయిపునాది

కొత్త కొత్త ఆశలు ఆశయాలు 
ఉగాది పచ్చడి షడ్రుచులు
జీవితంలోరుచిచూడాలి
నిరాశ నిట్టూర్పుల తరమాలి🌹

కామెంట్‌లు