చిన్నారి మనసు (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 రామనాథం, వైదేహిలు కూరగాయలు కొనడానికి మార్కెట్టుకు బయలుదేరినాడు. వెంట 4వ తరగతి చదువుతున్న కొడుకు శ్రీతేజను తీసుకుని వెళ్ళాడు. రామనాథం ఏది కొన్నా బాగా బేరం చేసి, తక్కువ డబ్బులకు వస్తేనే కొనే అలవాటు. మునక్కాయలు ఎంత అని అడిగాడు రామనాథం. 20 రూపాయలకు నాలుగు అన్నాడు చిరు వ్యాపారి. "6 ఇవ్వు" అన్నాడు రామనాథం. "నాకు చాలా నష్టం వస్తుందండీ. కుదరదు. దయచేసి బేరం చేయకండి." అన్నాడు  పట్టుపట్టాడు రామనాథం. క్రమం తప్పకుండా వస్తూ తెలిసిన వ్యక్తి కాబట్టి 20కి 6 మునక్కాయలు ఇచ్చాడు వ్యాపారి. అంతకు ముందు కొనుక్కున్న మరో ముగ్గురు ఇది గమనించి తమకూ అదనంగా ఇవ్వమని అడిగారు. బాధతో చేసేది లేక ఇచ్చాడు. అతని దగ్గరే బాగా బేరం చేసి మరికొన్ని కూరగాయలు కొన్నాడు రామనాథం.
       రామనాథం అటుగా వెళ్ళగానే శ్రీతేజ వెనక్కి వచ్చి చిరు వ్యాపారి చేతిలో వంద రూపాయలు పెట్టాడు. "నాకెందుకు ఇస్తున్నావు బాబూ!" అన్నాడు వ్యాపారి. "ఉంచుకో తాతా! నేను నీ మనవణ్ణి అనుకో." అంటూ తుర్రున పరుగెత్తాడు. కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోయి దగ్గరకు తీసుకుంది "పాపం! ఆ తాత ఎంత పేదవాడో!" అన్నాడు శ్రీతేజ. సిగ్గుతో తల వంచుకున్నాడు రామనాథం.

కామెంట్‌లు