అంతర్జాతీయ సదస్సులో శ్రీమతి నెల్లుట్ల సునీత ప్రముఖ ప్రసంగం


కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన పరిశోధన విభాగం శాఖ వారు నిర్వహించు రెండురోజుల 29 శుక్రవారం, 30 శనివారం ,అంతర్జాల అంతర్జాతీయ సదస్సు సంచాలకులు అధ్యక్షులు సదస్సు 
 ఆచార్య రామనాధం నాయుడు గారు ఆహ్వానం మేరకు  శ్రీమతి నెల్లుట్ల సునీత మొదటి సదస్సులో పాల్గొని సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రబంధ కావ్యం ఆముక్తమాల్యద లో రాజనీతిని,  మరియు రాయలవారి కళాతృష్ణ ,రచనాశైలి, పరిపాలనా దక్షత, ఆముక్తమాల్యద లో ఉన్న కాండిఖ్య కేశిధ్వజోపాఖ్యానం సారాంశంను, తెలుపుతూ ఆముక్తమాల్యద లోని
 ఈ కథ
 యువతకు ఎంతో స్ఫూర్తి అన్నారు.
ఇలాంటి కథలను పిల్లలకి పాఠ్యాంశంలో తీసుకుని నిర్మించి బోధిస్తే అవి వారి బాల్యాన్ని ధార్మిక పదంలో నడిపిస్తాయి అని వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి అని
ఉచితాల కోసం తాపత్రయ పడకుండా ఆపుతాయి అని. ఉచిత అనుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి  అని. మాట్లాడుతూ ఆముక్తమాల్యదలో కాండీఖ్య కేశిధ్వజోపాఖ్యానం  
 గుండెకాయ వంటిది అని. మనిషి ఏవిధంగా ఉండాలో తెలియజేస్తూంది  అన్నారు. గెలుపు ఓటముల విషయంలో కర్తవ్య నిర్వహణలో అవకాశాల తిరస్కరణ లో ప్రతిఫలించిన ధర్మ స్వరూపమే భారతీతకు వన్నెల ద్దుతూ వచ్చింది. ఇలాంటి కథలు కళ్ళు తెరిపిస్తాయని  దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు అని ఇలాంటి నీతి నియమం పాటిస్తూ అలాగే ఇలాంటి కథలు తప్పకుండా ముందు తరాలకు పంచాలని సదస్సులో శ్రీమతి నెల్లుట్ల సునీత ప్రసంగించారు.
ఈ సదస్సుకు స్వాగత పలుకులు  ఆచార్య ఎం. రామనాథ నాయుడు గారు పలికారు. మండలి బుద్ధ ప్రసాద్ మాజీ ఉప సభాపతి ఆంధ్రప్రదేశ్ గారు సదస్సును ప్రారంభించారు. ఈ సద్సును డాక్టర్ బి చక్రవర్తి గారు నిర్వహించగా
 ఎమ్. రంజిత్ కుమార్ గారు అధ్యక్షత వహించారు.
ఈ సదస్సులో తాన పూర్వ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు, బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య కె ఆశాజ్యోతి గారు, ఆచార్య  సంపత్ కుమార్ విశ్రాంత తెలుగు ఆచార్యులు మద్రాస్ విశ్వవిద్యాలయం గారు,
సాహితీ వేత్తలు, భాషాభిమానులు అధ్యాపకులు ,పరిశోధక విద్యార్థిని విద్యార్థులు, ప్రసంగించి పత్ర సమర్పణ చేశారు.
ఈ సదస్సులో ప్రసంగించుటకు అవకాశం కల్పించిన సదస్సు సంచాలకులు ఆచార్య రామనాథం నాయుడు గారికి శ్రీమతి నెల్లుట్ల సునీత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌లు