మాస్క్ మాట్లాడితే ;-విజయశ్రీ దుర్గ--కలం స్నేహము
ఓ మనిషి !!మాస్క్ ధరించు వైరస్ జయించు అంటున్నారంతటా 
నేస్తమా నాపేరే మాస్క్ ఓయి !!
నేనెప్పటి నుండో ఉన్నానోయి !!
ఆ డాక్టర్ పుట్టినప్పటి నుండి ఉన్నాను 
నేను నీకు తెలుసో లేదో 
ఎక్కడో  మూలపడ్డ నన్ను అందలం 
ఎక్కించేసారు మీరంతా 
సుక్ష్మజీవి  పుణ్యామాని నాకెంతో  బహు  ప్రజాధారణ ఈనాడు 
అయిదు రూపాయిల నుండి వెయ్యి రూపాయల దాకా నా ఖరీదు 
ఎవరో స్వామిజి చెప్పారంటూ నన్ను వేసుకోవటం మానేసారు ఓ నలుగురు 
అంతేగాలిలోప్రాణాలు కలిపేశారు పాపం 
కట్టిన చీర రంగు మాచింగ్ అంటు  రంగురంగులో ధరిస్తోంది నన్ను ఓ  కోమలాంగి 
నా పై బొమ్మలు కావాలంటున్నాడు 
ఆ  చిన్నోడూ 
చిరునవ్వుతో ఉండే మీ పెదవులని  రక్షణకవచముగా  నేను కప్పేసాను 
ఆ మేరీ ఏమో వాట్ నాన్సెన్స్ అంటు లిప్ స్టిక్ పూసేస్తోంది నా మీద 
ఆ షకీలా ఎమో మల్లెపూల ప్రింట్ ఉంటె 
తొడుగుతాను అంటు ప్రాణాలు వదిలి  మల్లెపూలు జల్లించుకుంది ఆఖరకు 
ఓ మూలపడున్న నన్ను  పెట్టి లక్షల్లో వ్యాపారము చేసేస్తున్నారు 
మరి నన్ను పెట్టుకుంటేనే షాపులోకి 
మీటింగుల్లోకి పర్మిషనోయి 
ఆ సూక్ష్మజీవికి  ఆమహామర్రికి నన్ను చూస్తే హై టెన్షన్ తోబలాదూరే 
ఓ మనిషి నేనుండగా భయమెలా 
నేనుండగా మరణమృదంగమెలా 
నీ ప్రాణం కోసము నన్ను జాగ్రత్తగా వాడుకోవోయి 
నీ ప్రాణానికి అండగా నేనుండగా 
నన్ను పెట్టుకోవద్దన్న చెప్పుడు మాటలు వింటూన్నావా 
ఇక నీ సంగతి అంతేనోయి 
మనిషి తప్పదోయి నన్ను వాడవోయి 
ప్రాణగండం  నుండి బయట పడవోయి
పక్షిజాతికందక నన్ను వాడేశాక జాగ్రత్తగా చెత్తబుట్టలో వెయ్యవోయి 
ఓ మనిషి నేనే నీకు రక్షణకవచమోయి 
ఓమనిషి నన్ను ధరించుటమరువకోయి


కామెంట్‌లు