లోకంపోకడ తెలుసుకోరా;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కల్లాకపటం
ఎరగనివాడా
లోకంపోకడ
తెలుసుకొనరా
సన్మార్గాన
నడుచుకొనరా

వక్రం వక్రం
మాటలు వక్రం
చేతలు వక్రం
బుద్ధి వక్రం
నడక వక్రం
అంతా వక్రం

అక్రమం అక్రమం
సంపాదన అక్రమం
ఆస్తులు అక్రమం
పోకడ అక్రమం
పనులు అక్రమం
అన్నీ అక్రమం

మోసం మోసం
పేమ మోసం
స్నేహం మోసం
త్యాగం మోసం
భక్తి మోసం
సర్వం మోసం

నటన నటన
ఏడుపు నటన
కన్నీరు నటన
ఓదార్పు నటన
వలపు నటన
పూర్తిగా నటన

బూటకం బూటకం
చెప్పేది బూటకం
చేసేది బూటకం
చేయించేది బూటకం
చూపించేది బూటకం
సర్వం బూటకం

వేరు వేరు
చెప్పేది వేరు
చేసేది వేరు
ఇక్కడ వేరు
అక్కడ వేరు
అసలునిజం వేరు

======================================

లోకం పోకడ తెలుసుకొని ప్రవర్తించరా
పైనేమో పటారం లోనేమో లొటారం
చూపేది మంచిదనం దాచేది చెడ్డదనం
కనిపించేది తెల్లదనం మరుగునపెట్టేది నల్లదనం

ఎదురుగావుంటే పొగుడుతారు ఎక్కడోవుంటే తిడుతారు
కడుపులో విషంపెట్టుకుంటారు  పెదవులపై అమృతం పూచుకుంటారు
తేనెపూసిన ఖడ్గం నాకితే నాలుక ఖతం
కనిపించేది పాలఘటం కనిపించనది కలిపినవిషం

కామెంట్‌లు