గురుబోధ! అచ్యుతుని రాజ్యశ్రీ

 సాధారణంగా విద్యార్థుల వయసు ఊహలకి తగినట్టుగా టీచర్లు పాఠాలు చెప్తారు. లేకుంటే  వారి మెదడు కి ఎక్కవు.పూర్వం గురుకులం లో కూడా శిష్యులందరికీ ఒకే రకంగా పాఠంచెప్పినా తమతెలివి ఊహాశక్తిని బట్టి శిష్యులు అర్ధం చేసుకునేవారు.కానీ ఎవరినీ చిన్నబుచ్చకుండా కథలాగా ఆగురువు వారి బుద్ధిచాతుర్యంని గ్రహించేవాడు.నందుడు మంచి తెలివిగలవాడు.అతనిపై ప్రత్యేకమైన ఇష్టం  దయ సానుభూతి ఉండేవి.పాపం  అనాధగా కనపడిన నందుని తన గురుకులం లో చేర్చుకున్నాడు.బలహీనంగా ఉన్న వాడిని తొందరగా అన్నంతినమని పంపేవాడు.ఇది మిగతా శిష్యులకు కంటకింపుగా ఉంది. గురువు ఆరోజు ఒక కథప్రారంభించబోతూ ఇలా అన్నాడు "ఎవరైతే  త్వరగా  సరైన జవాబు చెప్తారో వారిని ముందుగా భోజనం చేయడానికి పంపుతా. ఇకకథవినండి"అని ఇలాచెప్పసాగాడు.ఆరాజుకి నలుగురు భార్యలు. మొదటి భార్య ఏది అడిగితే అది వెంటనే ఇచ్చేస్తాడు.రెండో భార్య  షికారుకి వెళ్దాం అని అనగానే వెంటనే ఆమెతో బైలుదేరి ఎక్కడకి కావాలంటే  అక్కడకి తీసుకుని వెళ్తాడు.మూడోభార్యకి తన కష్టసుఖాలు అన్నీ ఏకరువు పెడతాడు.నాల్గవభార్య మొహంమాత్రం ససేమిరా చూడనే చూడడు.దీన్ని బట్టి మీకు ఏం అర్ధం ఐంది?"శిష్యులు అంతా ముక్తకంఠంతో  రాజు కి  నాల్గవ భార్య అంటే అస్సలు ఇష్టం లేదు. మొదటి ఇద్దరు అంటే చాలా ఇష్టం "అని జవాబు చెప్తారు."నందూ నీజవాబుఏంటి?" ఆయన ప్రశ్నకి నందుడి జవాబు ఇది"గురువు గారు!మా తర్క ఆధ్యాత్మిక బుద్ధిని మీరు పరీక్ష చేస్తున్నారు. మొదటి భార్య మనశరీరం.అది కోరినట్లు మనంచేయక తప్పదు.రెండోభార్య పాపపుణ్యాలు.వాడిచిత్తం ని అనుసరించి  వాడు గుడికి వెళ్లవచ్చు. లేదా చెడు పనులు చేయటానికి పోవచ్చు. మూడోభార్య బంధుమిత్రులు. వారి కి మనకష్ట నష్టాలు  సుఖదుఃఖాలు  చెప్పుకుంటాం.ఇక నాల్గవభార్య దేవుడు.భగవంతుని కన్నెత్తి చూడడు పన్నెత్తి పలకరించడు". అంతే మిగతా శిష్యులు సిగ్గుతో  తలవాల్చారు.నందుడి వివేకం తర్కం  ఆధ్యాత్మిక బుద్ధికి మనసు లోనే  వందనాలు  సమర్పించారు. 🌹
కామెంట్‌లు