వసంతా గమనం  ;-విజయకుమారి
నవ శకానికి నాంది/ప/
నవ నవోద్భవాల క్రాంతి

కోరి కోరి వస్తుంది ఉగాది/చ/
కోటి వేల్పులా వసంతం 
శోభకృత్ నామ వత్సరం
వన్నెలెన్నో తెస్తుందీ వరం

లే ప్రాయ బాల వయసు/చ/
లేలేత చిగురుల పర్వo
మత్తేకించే కోయిల కూత 
వేపపూత మామిడి కాత

తీపి పులుపు వగరు చేదు /చ/
ఉప్పు కారం మమేక మీ
షడ్రుచుల సంకేతo
అదో జీవన సంగీతం

మరిమల్చుకో ఆచరణా గీతం/చ/
జిహ్వ రుచులే కాదు
ఆత్మానంద జీవన సోపాన మది
అంతర్వాణి అదో దివ్యవాణి

సాక్షి భూతమై చరించు /చ/
చెప్పకో కోయితాత గొప్పలు
నడవ వోయి వారి బాటలో
చెడుచెరనీక మంచినెపుడు విడక

దయను మరువక దారి తప్పక /చ/
కదిలే దైవమై కదలాడరోజుకో పండుగ
వచ్చితీరు నిలువు టద్దమై నిల్చు
నీ ఎదురు నిత్య వసంతమయ్యి


కామెంట్‌లు