ధరిత్రి దినోత్సవం (ఇష్టపది )-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
ధరిత్రికి కృతజ్ఞత ధర్మమౌ మనకిపుడు 
జలవనరుల పొదుపుకి జాగ్రత్త లవసరము 

వనాల నీటివసతి జనాల బాధ్యతలగు 
నదీమ తల్లులకూ నడకలో సరళమగు 

గిరులనే తొలగించి సిరులకొరకు దురాశ 
భవనాలు వెలిశాయి సువనాలు తరిగాయి 

భూగోళ ముష్ణమున భోరుమని రోదించె 
ప్లాస్టిక్కు వ్యర్థాలు ప్లానుతో తొలగించు 

పర్యావరణ రక్ష పట్టుదల సాధించు 
భావి తరాలకి సంభావ్యతలు కలిగించు !!


కామెంట్‌లు