మార్పు చెందడంప్రకృతి లక్షణమై
జగాన చైతన్యం నింపుతూ…
ఆహ్లదమైన వసంతం సమస్త ప్రాణికోటికి
ఉల్లాసం నింపుతూ…
సంతోషాలు పంచే తియ్యదనం
అవమానాలతో ఎదురయ్యే చేదు అనుభవాలు
కష్టనష్టాలు నిరాశలు..ఇలా
ఎన్నెన్నో భావోద్వేగాల
సమాహారం జీవనగమనమని
అన్నింటినీ సమన్వయించుకుంటూ
ముందుకు సాగితే జీవితం నందనవనమంటూ..
ఉత్తేజానికి సంకేతమైన సంవత్సరాది
భావోద్వేగాల ప్రతిబింబమైన
మానవ జీవితంలో
ఆలోచనలను ఆవిష్కరింపచేస్తూ
వ్యయప్రయాసలు తగ్గించుకుని
ప్రతికూలత ఎంతెదురైనా ప్రతిఘటించి
చైతన్య సారథులై సాగమని సందేశమిస్తూ….
వసంతగానంతో ప్రకృతిపరవశం
పచ్చని తోరణాలు
షడ్రుచుల ఉగాదిపచ్చడి
పిండివంటలు
ఆలయదర్శనాలు
సాహిత్య కార్యక్రమాలు
పంచాంగశ్రవణాలతో
సందడి తెచ్చిన శుభకృత్ నామ సంవత్సరం
శోభాయమానమై సర్వ శుభాలు
కలుగచేయాలని కోరుకుంటూ
ఉగాది శుభాకాంక్షలు 🎊
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి