అంకురం;-- సాకి, కరీంనగర్.
 ఏనాడైనా
బీజం వృక్షపరిణామంలో
దుఃఖించిందా?
ఓడిపోయిందా!?
ఎన్నో అడ్డంకుల్ని
ఆసరాగ చేసుకొని 
ఆకాశం వైపుకి ఎదని చాచింది
అంకురం- అంబరమై
అవనికి నీటినీడనిచ్చింది
జనులకి ప్రాణ'భిక్ష' పంచింది
అయినా అంకురానికి
గెలుపుగర్వం లేనే లేదు
అంకుర ఉనికే లేదు
ఓటమి లేని ప్రతిబీజానిది
గెలుపుచరిత్రే
మనిషికి స్ఫూర్తికథే!
బీజంలోని చైతన్యశక్తి 
మానవునిలోని సంకల్పశక్తి
గెలుస్తుంది-గెలిపిస్తుంది

కామెంట్‌లు