*తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక* ప్రథమ వార్షికోత్సవం

 హైదరాబాద్ లో  (బాగ్ లింగంపల్లి) సుందరయ్య కళానిలయంలో17 ఏప్రిల్,2022 ఆదివారం రోజున  *తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక* ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ శ్రీ జూలూరి గౌరీశంకర్ గారు ,మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్,ప్రముఖ కవి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు,ప్రముఖ కవి కావూరు శ్రీనివాస్ గారు వంటి ప్రముఖులు కార్యక్రమానికి హాజరైనారు.పత్రిక నిర్వాహక బృందం కార్తీక్ నిమ్మగడ్డ,లక్ష్మి,
హిమబిందు,స్వప్న(బుజ్జమ్మ) లు మేడ్చల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయిని, కవయిత్రి శ్రీమతి  *చంద్రకళ.దీకొండ* గారిని ఈ కార్యక్రమంలో ఆమె చేసిన సాహితీ సేవకు గాను *రైటర్ ఆఫ్ ది ఇయర్* జ్ఞాపిక మరియు సర్టిఫికెట్ నిచ్చి  సత్కరించటం జరిగింది.ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు సాహితీ మిత్రులు ఆమెను ప్రశంసించడం జరిగింది.

కామెంట్‌లు