తెలుగు సాహితీలోకంలో అనేక ప్రక్రియల ప్రవేశం ఇటీవల కాలంలో ఎక్కువయింది. వాటిలో నిలదొక్కుకొని రాశిలో వాసిలో దిట్టముగా నిలిచిన అర్ధవంతమైన ప్రక్రియల్లో "రవ్వలు "ఒకటి !
నాలుగు పాదాల రవ్వలు ప్రక్రియలో, మూడు పాదాలు విషయనిర్దేశం తో... కాస్త ఎడం గా నాలుగో పాదం రవ్వల్లే మెరిసి ఆలోచన లో పడేస్తుంది ఆఁహాఁ అనేలా !
రవ్వలు నియమాలు
3 పాదాలు మొత్తం ఒక యూనిట్‌గా చెప్పి
కొంచం ఎడంగా 4 వ పాదం
చక్కని ముగింపు పలకాలి
అదే " రవ్వ "
4 వ పాదం చాలా ముఖ్యం !
3 వ పాదం తరువాత గీత,
అలాగే 4 వసాదం ఆరంభంలో గీత తప్పని సరిగ రావాలి!
అంశాలపరిధిలో ఇమడని ఈ రవ్వలు ఎటువంటి శీర్షిక కైనా సమన్యాయం చేస్తూ విషయాలు వివరించగలవు. సాంఘిక, సాహిత్య భావాలే కాకుండా భక్తి మార్గం లో కూడా మెరిపించిన ప్రయత్నం ఈ రవ్వల గీత ! రచయిత ఈ విధానంలో సఫలీకృతులైనారు. వేల శ్లోకాలను కొద్దీ రవ్వల్లో ఇమిడ్చిన గీతాసారము భవ్యము దివ్యము అనిపిస్తుంది. వారి పరిచయస్తులు గొప్ప పదవుల్లో ఉన్న మహానుభావుల అభిప్రాయమూ ఇదే ! వ్యవస్థ గురించి, వ్యక్తి వికాసం పట్ల ఆసక్తి తో మెలగాల్సిన ఈ సమయం లో ఈ రవ్వలగీత ఆణిముత్యం !
లక్షణమైన మహా గీతా యోగసారాన్ని, నిగూఢమైన అనంతశక్తినీ, ధర్మసూత్రాన్ని, కర్తవ్య బోధననూ ఈ రవ్వల ప్రక్రియ లో వర్మ గారు అలతి పదాలతో వివరించారు !
మచ్చుకు... 226 రవ్వల్లో కొన్ని చూద్దాం..
మనసు
సంకల్ప వికల్పాల
సంఘాతం.....
... నిలకడ అవసరం !
నేనందరికి
గోచరింపను
అది యోగ మాయ.....
...... మాయను వీడండి !
పాపనిగ్రహం
చేత కావడంలేదు
మోహాన్ని వీడండి....
...మోహంవీడితే అదేముక్తి!
చావంటే భయం
సామాన్యం
ఇంతకు ముందూ ఉంది....
... భయందాన్ని గుర్తుచేయదు !
ధీరునికి
భయంలేదు
నిర్భయం కార్యసోపానం..
.... మెట్లెక్కి కర్తవ్యాన్నందుకో !
ఇది నాకు చాలా నచ్చింది.
నిన్నటి
తెలియంది
ఎరుకలోకి రావడం....
...
జ్ఞానావిర్భావమే కదా !
అక్షర సత్యమే ఇది అందరికి అర్ధం కానిది.
పరస్త్రీ వ్యామోహం
పాలపొంగు
అమ్మ అనే భావన...
...... చన్నీళ్ళ చిలకరింపు !
అద్భుతమైన రవ్వ ఇది.. గీత నేటికీ నిత్య ఆచరణణీయమైనది !
నిర్గుణము
సగుణ మైన
పరమాత్మ తత్వం....
.... అన్నివిద్యల తలమానికం !
రుచి వాసనలు
సయ్యాటలాడి
అలిసిపోతే....
...... కలిగేది చింత !
అవును మరి అనుభవాలు అన్నీ అయ్యాకే కళ్ళు తెరిపిడి !
విధి విధానం
నియమం
లేకుండా.....
........ గాలివాటు బ్రతుకు !
ఈ భావన భక్తి కే కాదు. సంఘంలో సామాన్యులకి కూడా వర్తిస్తుంది కదా !
నిందా స్తుతులకు
చలించని
భక్తుడే...
...... స్థితప్రజ్ఞుడు !
ఇంకా ఉత్సాహం మిత్రుడు, శోకం శత్రువు అంటూ సహజమైన పదాలతో రవ్వల గీత సూటిగా ఎంతో చెప్తుంది !
ఈ సంపుటి అనేక మంది ప్రశంసలు పొందినది. వర్మ గారి కలం నుండి మరిన్ని చక్కని రచనలు వెలువడాలని ఆశిస్తూ..
రవ్వల పోటీలో గెలుపొందిన నాకు ఈ రవ్వల పుస్తకాలు బహుమతి ఇచ్ఛి, ప్రక్రియ సాధనతో బాటూ... సమీక్షాభాగ్యం కలిగించిన వర్మ గారికి నమస్సులతో...
ఎం. వి. ఉమాదేవి
ఇందుకూరు పేట
23- 4-2022
చరవాణి.. 7842368534

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి