చతురత! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజు యశోవర్మ ఆస్థానంలో చతురశర్మ అనే మంత్రి ఉన్నాడు.రాజు సందేహాలు చిటికెలో తీర్చేవాడు.పెద్ద పెద్ద విషయాలు  వాటి నిర్ణయాలు మంత్రి పై వదిలేసేవాడురాజు.ఆరోజు  ఓఆగంతకుడు దర్బార్ లోకి వచ్చాడు. పొడవైన గడ్డంమీసాలు చురుకైన కళ్లున్న వృద్ధుడు!అందరినీ ఆకర్షించాడు."ప్రభూ!నేను అన్నిరాజ్యాలు దర్శించాను .నాసందేహాల్ని ఎవరూ తీర్చలేకపోయారు.మీరాజ్యంలో చతురత  తెలివితేటలున్న  నాగరికులున్నారని  తెలిసి ఇలా వచ్చాను"అన్నాడు.
 "మీసందేహాలు అడగండి "అని రాజు  అన్నాడు. ఆవృద్ధుని ప్రశ్నలు ఇవి"ఈపృధ్వి అనంతం!దీని కేంద్ర బిందువు ఎక్కడ?భూమి గుండ్రం కాబట్టి దాని కేంద్రం  ఏప్రాంతంలో ఉంది? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని?నాగడ్డంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి?" సభంతా చీమచిటుకు మన్నంత నిశబ్దం! దాదాపు  అరగంట గడిచినా కుయ్ కయ్ లేక పోటంతో హేళనగా అన్నాడు "మీరాజ్యంకి ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి?"అప్పుడు మంత్రి  చతురశర్మ గొంతు సవరించుకుని ఇలా అన్నాడు "
 మాప్రభువుగారి సింహాసనం వెనుక కాలికింద కుడివైపుగా ఉంది ఆభూకేంద్రబిందువు.మీకు అనుమానం ఐతే స్వయంగా కొలతబద్దతో భూమి రెండు కొసల్ని వాటిమధ్య దూరాన్ని  కొల్చి చూడండి. తేడా భేదం ఉంటే నిరూపించండి.మారాజుగుర్రంపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని చుక్కలు ఆకాశంలో ఉన్నాయి.ఆఅశ్వాన్ని  సభలోకి రప్పించుతాను.ఇకమీమూడో ప్రశ్నకి జవాబు-మీగడ్డంలోని ఒక్కో వెంట్రుకను మాభటుడు పీకుతాడు.మీరు కుయ్ కయ్ అనరాదు. అలా గుర్రం శరీరం పై రోమాలు మీగడ్డం లెక్క చిటికెలో ఒకేసారి తేలిపోతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!" ఆమాటల్తో ఆవృద్ధుడు ఖంగారు తో తత్తరబిత్తర ఐనాడు."ఉహు!వద్దొద్దు! నాసందేహాలు తీరాయి."అని అంటుండగానే ఠక్కున  మంత్రి  అతని తెల్లగడ్డం జుట్టుని బలంగా గుంజాడు.ఆశ్చర్యం!అవి పెట్టుడువి! తమశత్రుదేశపు గూఢచారి అని అతనిని చెరసాల లో పెట్టించాడు."చూశారా ప్రభూ! రాజైన వాడు ఎవర్నీ త్వరగా సభలోకి అనుమతించరాదు.బాగా ఆచితూచి సమాచారం సేకరించాక మాత్రమే ముందడుగు వేయాలి. ఇతను రెండు రోజులక్రితంమన నగరం లోకి ప్రవేశించాడు.వేగులద్వారా నేను ఈవిషయం తెలుసుకున్నాను."అన్న మంత్రి మాటలకు సభంతా హర్షధ్వానాలతో మారుమ్రోగింది🌹
కామెంట్‌లు