ఆదివారము నాడు
అరటి పండ్లిచ్చాయి
సోమవారము నాడు
సపోట పండ్లూ
మంగళవారము నాడు
మామిడీ పండ్లూ
బుధవారమునాడు
బత్తాయి పండ్లూ
గురువారము నాడు
ద్రాక్షలా నిచ్చాయి
శుక్రవారము నాడు
జామా పండ్లూ
శనివారం నాడు
చక్కనీ నారింజ
అన్నివారములకు వృక్షాలూ
ఎన్నెన్నొ పండ్లనూ ఎంచి ఇస్తున్నాయి
మంచి పండ్లను మనకు
పంచి ఇస్తున్నాయి
మన ఆరోగ్యములను కాపాడుతున్నాయి
అందుకే మనమంత వృక్షజాలమును
పెంచిపోషించి కాపాడుకోవాలి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి