శుభకృతునామ సంవత్సరానికి సుస్వాగతం;- సత్యవాణి
 ఓ శుభకృతూ! నిండుమనసుతో
నిర్మలమైన గంగానదిలా
కాలూను మాదేశంలో
విధి చేసిని వికృత చేష్టలకి
విసిగి వేసారిన మామనసులకు
చల్లని వెన్నవంటి నీ ఆప్యాయత చూపి మరపించి మా మనోనిబ్బరాలను పెంపొందించు
శుభకృతు వత్సరమా రా
శుభాలపరంపర కలుగజేయి ఇంటింటా కల్గించు          
మేము పట్టిందల్లా బంగారంగావించు 
చుట్టిందల్లా పట్టుబట్టలు గావించు
మనుష్యుల మనసులలోని మాలిన్యాలను తొలగించి మల్లెలుగా ఘుభాళింపజేయి
మా మనుష్యులలోని కాఠిన్యత తొలగించి మమ్ము మహనీయులుగా తీర్చి దిద్దగారా ఓ శుభకృతూ
ప్రకృతిని పరవసింపజేయి
ప్రజావళికి ప్రమోదము కలుగజేయి
      బంధుమిత్రులందరికీ
ఈ శుభకృతు శుభాలపరంపరలు కలుగజేయాలని ఆశిస్తూ,
            మీ సత్యవాణి

కామెంట్‌లు