1)
దరిద్రం ఎడారిలో
నిలిచినాను
మిత్రుడు
గుడారంలా పిలిచినాడు !
2)
ఒంటె మిత్రుడితో
వెళ్తున్నా ఎడారిలో
దగ్గరలోనే
ఉంది ఒయాసిస్ !
3)
ఎడారిలో ఏంటి
సంబరాలు
ఖర్జురాల చెట్లు
దైవలీల !
4)
వరుడికి దుబాయ్ లో
ఉద్యోగం అన్నారు
ఎడారిలో
ఒంటెలు మేపేపని !
5)
భూమిని అమ్మి
గల్ఫ్ కి పయనం
ఎడారిలో ఎండమావి
అయింది బ్రతుకు !
6)
అలల్లా ఇసుక
కదలని సముద్రం
దారిలేని తీరాన
దిక్సూచి ఎడారి ఓడ !
7)
ఎంత కురిసినా
నీరు దక్కదు
కురవడానికి
మేఘాలూ ఇష్టపడవు !
8)
ఎడారి లాంటిదే
ఒంటరితనం
ఆశలు ఆలోచనల
జలం ఉండదు !
9)
వాన చుక్కలు
వడిసిపట్టిన ధాటీ
ఇజ్రాయెల్
ఎడారి సేద్యంలో మేటి !
10)
రొయ్యలచెరువులు
డాలర్ల పంట
ఊరు మొత్తమైనది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి