:జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....;-:డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
రైటనుకున్నవన్నీ రాంగ్ అని తెలుసుకున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
బంధాల,అనుబంధాల చిక్కదనాన్ని‌ చవిచూస్తున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
డబ్బు చుట్టూ అల్లుకున్న‌ అవసరాలు ఒట్టివే అని గ్రహించా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
విజయాల,అపజయాల ఆనవాళ్ళను తుడిచేసుకుంటూ వెళ్తున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
శాశ్వతమేదీ కాదన్న సత్యాన్ని రూఢీ చేసుకుంటున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
కొన్నసలు మారనే మారవని నిర్థారించుకున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
ప్రేమ పరిమళపు సుగంధాలను ఆస్వాదిస్తున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
మనకేమీ తెలియదన్న విషయాన్ని రాసి పెట్టుకున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
అవసరాలకు ఏర్పరుచుకొన్న సౌకర్యాలు వృథా అని రోదించా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
ఆఖరి మజిలీ ఒంటరిగానే ప్రయాణమవ్వాలని సిద్ధపడుతున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
పొరలు పొరలుగా విడిపోతున్న అసత్యాలను అర్థం చేసుకుంటున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
దైవమే శరణమని నినదిస్తున్నా!
జీవితం ముందుకెళ్తున్న కొద్దీ....
నన్ను నేను పూర్తిగా తెలుసుకుంటూ,లోకాన్ని‌ వదిలేస్తున్నా!
కామెంట్‌లు