చంపకమాల
శిరమున చంద్రవంక ముడి; చిన్మయరూపుడ భక్తవత్సలా!
కరమున శూలమున్ గలిగి కాశిని నిల్చిన విశ్వనాథుడా!
వరములు నిచ్చె దేవుడవు ; వాసిగ భక్తులనేలగానుమా!
మొరవిని రావ వేగమున; మోక్షమొసంగెడి పార్వతీశ్వరా! .
చంపకమాల
హిమగిరి వాస యీశ్వరుడ యిమ్మహి భక్తులు వేడుకొందురే
ఢమర వినోది నిన్ను మది; ధ్యానము జేసెరు మౌను లెల్లరున్
సుమ శర మన్మధున్నిలన; స్రుక్కియు భస్మము జేసియుంటివే
నుమపతి దేవి పార్వతియు; నుండక, మన్మథ లోక ముండునే!
ఉత్పలమాల
యజ్ఞము చేయ దక్షుడును; నన్నియు సిద్ధము జేసి కోరికన్
యజ్ఞపు పూజకై శివుని; నారయ రమ్మని బిల్వకుండెనే
యజ్ఞము జూచి వచ్చుటకు; నాదిపరాత్పరి వేగుదెంచెనే!
ప్రజ్ఞను జూపి దక్షుడును; పార్వతి నెన్నియొ భాష లాడెనే! .
చంపకమాల
మనసున బాధ జెందియును; మానిని దుఃఖము జెందివేగమే
తనువును మంటలందునను దగ్ధము జేసుక భస్మమాయెనే!
వినియును పార్వతీశుడును; విశ్వ పరాక్రమ రుద్రరూపుడై
తనయుని వీరభద్రునిక ; దక్షుని ఖండన జేసిరమ్మనెన్ .
===========================================
మచ్చ అనురాధ
యస్.ఏ.తెలుగు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి