మంచినీరు!!;- ప్రతాప్ కౌటిళ్యా
మార్మిక భాషలో
మర్మం మాట్లాడుకుంటుంది
కర్మ మా కాళ్లు చేతులు పడిపోయి
బండ రాయిలా మారిపోయింది!!?

దూరంగా ఎవరో పిలుస్తున్న పిలుపులు
యమున్నీ పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు
సంకేతాలు!!?

ధర్మం ప్రాణం విడిచి
కొత్త శరీరాల్ని వెతుక్కుంటుంది!
ముక్కలు ముక్కలుగా నరికబడ్డ గాలి
గతమంతా సంగీతం గానే మిగిలిపోయింది!

ఆవులిస్తున్న మొసళ్ళు
ప్రస్తుతం నీటి బయటనే నిద్రొస్తున్నవీ
కళ్ళ మూసలో బంగారం పోస్తే
చూపులన్ని సూర్యకిరణాలు అవుతున్నాయి మళ్లీ!!?

మరణిస్తున్న అక్షరాలు
ఊపిరి పీల్చుకుంటున్న కాగితాల గతాల్నీ
కాల్చేస్తూ మరణ శాసనాల్నీ రచిస్తున్నవీ!!

ఎగిరిపోతున్న కాలం తెగిన గాలిపటంలా
చీకటి వెలుగుల ఇంటిపై
తల దాచుకుంటుంది!!

మనసిచ్చి చూడు మచ్చలేని నిజానికి
పచ్చని ఆకుల అన్నం వడ్డించిన విస్తరి అవుతుంది!!?

ఏడుస్తున్నది ఎవరో
దుఃఖం ముఖం చాటేసుకుంటుందీ
కళ్ళు వొళ్ళు ముడుచుకుంటుంది
కన్నీళ్లు పాతాళంలో దాక్కుంటున్నవీ?!

కాళ్లతో తొక్కిన మట్టిని
కుమ్మరి కుండలు చేస్తే
రైతు వరినీ తయారు చేస్తే
వరం పొందిన అమ్మ మాత్రం బ్రాహ్మల
మట్టి బొమ్మలు సృష్టిస్తుంది!!?

దిక్కుల్ని మరచిన కుక్కలు
రాత్రంతా మేల్కొని
దేవుళ్ళని ప్రార్థిస్తున్నట్లు
పాపాలన్నీ పావురాల లా ఆకాశంలో ఎగురుతున్న వి!!!?

ఎవరిని ప్రశ్నించినా
సమాధానం నిదానంగానే వస్తుంది
ప్రశ్న మాత్రం సమాధానం గొంతులో
త్రిశూలం లా గుచ్చుకుంటుంది!!?

తల నరకబడిన కలలు
శివుని మెడ చుట్టూ కున్న
త్రాచు పాములు!!!?

పాలు చిక్కగానే ఉన్నాయి
సముద్రం నీరు ఉప్పు గానే ఉంది
మంచినీళ్లు మాత్రం కొంచెం
మంచి వాళ్ళ కోసమే!!?

Dedicated to my beloved sister Padmavati and sasikala
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు