వావిలాల వర్ధంతి; -డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
ఏప్రిల్ 29 వర్ధంతి, జయంతి.   సందర్భంగా --  *
================================
       
వావిలాల గోపాలకృష్ణయ్య
ఆ పేరు,
            సేవకి కాసుల పేరు!
ఆ జీవితం,ఆదర్శానికి,
             నిలువెత్తు సంతకం!
స్వాతంత్ర్య సమర యోధుడు,
 విరామమెరుగని నాయకుడు!
అజాతశత్రువు,సదా
 సదాచారి,ఆజన్నబ్రహ్మచారి!
పద్మభూషణుడు,
                కళాప్రపూర్ణుడు!
వక్తగా ఆయన ఉపన్యాసం,
               జనచైతన్య స్ఫూర్తి!
గ్రంథకర్తగా, తెలుగు (45),
                   ఆంగ్లం (16)!
ఆ అక్షరవిన్యాసం,
          చదువరుల విజ్జానదీప్తి!
సోషలిస్టు, ఆంధ్రా గాంధీ,
 ఖాదీ ధరించే సీదాసాదావ్యక్తి!
విలువలకు పట్టం కట్టిన,
              అసాధారణ శక్తి!
ప్రజాప్రతినిధిగా ఆయన,
                  ప్రవర్తనా తీరు!
ఒకింతయినా,
నేటి మనప్రజాప్రతినిధులు
     అనుసరిస్తే, జాతికి ఎంతో,
                మేలు చేకూరు!
  పైన ఉన్న ఆయనకు, 
          ఆత్మశాంతి కలిగి తీరు!

  ________

     రాజారవివర్మ జయంతి

చిత్రలోకాన పరిచయం,
          అవసరం లేని కుంచె!
అది కట్టింది, వర్ణచిత్రాలకు,
           సరి జరీఅంచు పంచె!
చిత్రజగతి రాజు
వర్ణచిత్రాకాశాన ,
             అస్తమిచని రవి
 అద్భుత చిత్రాలు,
 సృష్టించిన బ్రహ్మ,మన వర్మ,
వెరసి రాజా రవివర్మ!

ఆయనకళ,  భారతీయ,పాశ్చాత్య,
చిత్రకళల అద్భుత సంగమం!
రామాయణ, మహాభారత
ఘట్టాల అపూర్వ ఆవిష్కారం!
ఆయన చిత్రాల్లో ,
స్త్రీకి కట్టిన చీరకట్టు,
    కాలంలో మాయని కనికట్టు!
ఆయన పేరు తలిస్తే,
శకుంతల ,యశోదా కృష్ణ
   హంస దమయంతి,
ఫలం చేతనున్న యువతి,
" గ్లో ఆఫ్ హోప్ వంటివి,
జనహృదయఫలకాలపై,
                నిలుస్తాయి,
కళ అమరం అని,
                  తెలియజేస్తాయి!
రవివర్మ చిత్రాలు దర్శించడం,
   ఆనందలోకాలు విహరించే,
                       సుకర్మ!

సుకర్మలో ఆయనకందని,
   ఒకే ఒక అందం అన్వేషిద్దాం!
_'________

కామెంట్‌లు