తాన అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఒడిశా నుంచి ఎంపికయిన సింహాద్రి శ్రీనివాస్ రావు


 ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) భారతదేశ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలో విజేతలుగా నిలిచిన కవుల కవి సమ్మేళనం కు ఒడిశా నుంచి సింహాద్రి శ్రీనివాస్ రావు  ఎంపికయ్యారు. ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకొని పలు సామాజిక అంశాలపై తానా ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకంగా కవితల పోటీ నిర్వహించింది.
ఈనెల 22, 23,24 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచ స్థాయి కవిత వేదిక మీద “నాదేశం పల్లెటూరు  ” అనే కవితను సింహాద్రి శ్రీనివాస్ రావు  వినిపించబోతున్నారు. దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే తానా కవితాలహరి లో పాల్గొంటున్న   సింహాద్రి శ్రీనివాస్ రావు  ను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, పలు సాహితీ సంస్థల ప్రతినిధులు, సాహితీవేత్తలు అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు