సుఖపడటం తప్పుకాదు.
ఆ మోజులో పడి భవిష్యత్తు -
పాడుచేసుకోవడం తప్పు!
భక్తిగా ఉండటం తప్పు కాదు.
ఇతరుల మనోబావాలు -
దెబ్బతీయడం తప్పు!
తినడం తప్పు కాదు.
తిండే ప్రదానం -
అనుకోవడం తప్పు!
భార్యపిల్లల కోసం
బ్రతకడం తప్పు కాదు!
జన్మ నిచ్చిన తల్లిదండ్రులను
నిర్లక్యం చేయడం తప్పు.!
సేవ చేయడం తప్పు కాదు.
సేవ పేరుతో దోచుకోవడం,
దాచుకోవడం తప్పు!
సంపాదన తప్పు కాదు.
సంతోషానికి -
దూరం అవ్వడం తప్పు!
నాయకులు కావడం
తప్పు కాదు....!
నమ్ముకొన్న వారికి
ద్రోహం చేయుట తప్పు!
స్నేహం చేయడం
తప్పు కాదు.....
స్నేహంపేరుతో-
మోసం చేయుట తప్పు!
కోపపడటం తప్పుకాదు.
కొట్టటం, తిట్టడం తప్పు!
కార్లలో తిరగడం తప్పుకాదు.
నడచివెళ్లె వారిని చూసి
నవ్వడం తప్పు.....!
బంగారం ధరించడం
తప్పు కాదు....
బాధలలో ఉన్నవారిని
ఓదార్చకపోవడం తప్పు!
చదువు కోవడం తప్పు కాదు.
సంస్కారం లేకపోవడం తప్పు!
ఖరీదైన వస్త్రాలు !
దరించడం తప్పు కాదు.
లేనివారిని చూసి-
హేళన చేయడం తప్పు!
ఆశపడటం తప్పు కాదు.
అత్యాశ పడటం తప్పు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి