అసలైన సంపద! అచ్యుతుని రాజ్యశ్రీ

 సుకేతుడనే రాజు మారువేషంలో నగరం లో తిరిగేవాడు.ఒక చోట ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. వారి మాటలు వింటూ ఆనందిస్తున్నాడు రాజు. అక్కడ ఉన్న పళ్ళ చెట్లుఎక్కి పళ్ళు రాల్చి తమ బుట్టల్లో నింపారు.హరి అనే పిల్లాడు రాజు దగ్గరకు వచ్చి "మామా!కొన్ని పళ్ళు మీరూ తీసుకోండి" అని వినయంగా అడిగాడు. రాజు ముచ్చట పడి మిగతా ఇద్దరిని పిల్చి"మీకు ఏంకావాలి? మీరు ఏమి అవుదామని అనుకుంటున్నారు?"అని అడిగాడు. రవి అన్నాడు " నాకు పెద్ద ఇల్లు పొలం తోట కావాలి. హాయిగా ఉంటాను."గిరి అన్నాడు "నాకు ఈసంచీ బుట్ట నిండా బంగారు నాణాలు కావాలి.వాటితో హాయిగా బతుకుతా". "హరీ! మరినీకేం కావాలి?" "మామా!నేను బాగా చదువుకుని గొప్ప పండితుడిని కావాలి.బీదవారికి ఉచితంగా చదువు చెప్తాను. రాజు గారి సభలో కొలువు సంపాదిస్తాను.కానీ ఆఅవకాశం రావాలి కదా?" రవి గిరి కూడా తమ బుట్టలోని దోసెడు పళ్ళు తీసి రాజు కి ఇచ్చారు. కాసేపు వారితో గడిపి రాజు వెళ్ళి పోయాడు. ఆమర్నాడు  వారిని తీసుకుని రమ్మని రాజు భటుని పంపితే వారు భయం భయంగా రాజసభలో అడుగు పెట్టారు.రాజు కంఠం వినగానే  భయంతో వణికిపోయారు.ముందుగా హరితేరుకుని"ప్రభూ!మిమ్మల్ని మామా అని పిలిచాను. క్షమించండి "అన్నాడు. "ఫర్వాలేదు బాబూ! ఆపిలుపు ఎంతో హాయిగా ఉంది. నీవు మా పండితులదగ్గర చదువుకో" అని వారికి  హరిని అప్పగించిరవి కోరిన ఇల్లు పొలం చిన్న తోట ఇచ్చాడు.గిరి కి బుట్ట సంచీనిండా బంగారు నాణాలు ఇచ్చాడు.ఇరవై ఏళ్ళు గడిచాయి.హరి గొప్ప పండితుడై రాజాస్థానంలో  గౌరవ మర్యాదలు అందుకుంటున్నాడు.కరువుకాటకం వరదలతోరవి ఇల్లు పొలం తోట సర్వనాశనమైనాయి.పూరిగుడిసెలో ఉంటూ కూలీపని చేస్తున్నాడు.గిరి జల్సాలలో మునిగి తేలి డబ్బు పోగొట్టుకున్నాడు. దొంగ గా మారాడు. రాజు వృద్ధుడై రాజ్యభారం కొడుకుకి అప్పగించి మారువేషంలో ప్రజల్ని గూర్చి వాకబుచేస్తూ హరిని వెంటబెట్టుకొని తిరిగేవాడు.యాదాద్రి సమీపంలో రవి ముష్టి ఎత్తుకోటం గమనించి హరిఅతన్ని తన ఇంట్లో నౌకరుగా  నియమించుకున్నాడు."రవీ!అన్నిటికన్నా ముఖ్యం చదువు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే! ఇల్లు పొలం పుట్ర శాశ్వతం కాదు. ఇక గిరి దొంగగామారి జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు."నిజమే! చదువు ఉంటే మన కాళ్ళపై మనం నిలబడి గౌరవంగా బతకగలం.దొంగలు ఎత్తుకు పోలేరు.దొరలు దోచుకోలేరు.🌷
కామెంట్‌లు