ఈ ఆటుపోట్ల జలధి లో.... ఆ నావను చూస్తే... కనిపిస్తోంది నా జీవితమే !
ఈప్రపంచసాగరంలో...సమాజ నదీ ప్రవా హానికి ఎదురీదిన నా బ్రతుకు, నన్నెంతగా ఆందోళన పరచిందో,నాకుమాత్రమేతెలుసు!
నావాళ్ళను ఒడ్డుకు చేర్చే ప్ర యత్నంలో...నేనెన్నిఅగచాట్లు పడ్డానో...ఇది చూస్తుంటే గుర్తొ స్తోంది ! సడలిన ఆత్మ విశ్వాసం ఆత్మన్యూనతకుగురిచేసినప్రతి సారీ... బాధ్యత కర్తవ్యాన్ని గుర్తుచేసి, కదలలేని ముసిలెద్దు
ముడ్డిదగ్గరమంటపెట్టి,ముందుకు కదిలించినట్టే.. నన్నునడిపిం చింది !
ఏది ఏమైతేనేం...చేర్చలేనన్న తీరాన్ని చేరిపోగలిగాం !
ఊహ తెలిసిన దగ్గర నుండీ... తల్లీ, తండ్రీ, గురువూ,దైవమూ సర్వమూ నాకు ఆ సర్వేశ్వరుడే నని, నాతండ్రి ఏమి చేసినా.... ఆదినామంచి కేనని, పూర్ణ విశ్వాసముతోనే బ్రతికాను !
నా నమ్మకము వమ్ము కాలేదు.
ఆఖరిమజిలీలో కాస్తంత ప్రశాంతంగా... కొలనులో బోటు షికారు లా ఈ జీవితం ఇలా సాగిపోతున్నందుకు, సహకరిం చిన ఆ పరమాత్మకు శతకోటి వందనములు సమర్పించు కుంటూ...,ఆ దేవుని నమ్మిన వారు ఏనాడూ చెడిపోరని స్వానుభవంతో...చెబుతున్నా !
*****-

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి