మొలక కు ఉగాది శుభాకాంక్షలు ; అచ్యుతుని రాజ్యశ్రీ
 మొలకలన్నీ మహావృక్షాలై
భావాల పూలువెదజల్లాలి
మంచిమామిడి పళ్ల పరిమళాలు
ఘుమఘుమ లాడాలి!
వేదాంత సూరిమామ ఆధ్వర్యంలో కొత్త కలాలు కదలాలి!
కొంగ్రొత్త కోయిలలు గొంతు విప్పాలి!
శుభకృత్ శోభాయమానంగా
ఉగాది పచ్చడి రుచిచూపాలి!
జయహో మొలకా!రచనలకు
తారాతోరణంకట్టే ఆద్యురాలివి
నీచేయూతతో పిల్లల పెద్దల
కలాలు గళంవిప్పె!మళ్లీ శుభకృత్ తో కలుద్దాం!🌹

కామెంట్‌లు