అమ్మా పాడకే ;-VT రాజగోపాలన్ మైసూరు 9940013300
అమ్మా పాడకే 
నిదుర రావడంలేదే 
న్యూట్రిన్ చాక్లెట్ ఇస్తా 
గల గల మనే గిలక నిస్తా 
కాసేపు పాటను ఆపవా నా తల్లీ 
"అమ్మా"

నా నిదుర కోసము 
ఎన్నెన్ని రాగాలు 
కూని రాగం చాలు  
సల్లగా నిదురోతా.. "అమ్మా"

రాగాలను ఖూనీ చేస్తూ 
రాద్ధాంతము చేస్తున్నావ్ 
నిదుర రాక నేనేమో 
నీ దగ్గర కొచ్చేశా... "అమ్మా"

నా మీద నీ ప్రేమకు 
హద్దులు లేవులే 
ఆ విషయం నేనులే 
ఎప్పటికీ మరువనులే "అమ్మా"

నాన్నగారు అందుకే 
పెందరాడే పనికెళుతూ 
రాత్రి పది గంటలైనా 
ఇంటికి రానంటాడు.. "అమ్మా"

నాన్న ప్రేమ కావాలే 
రాగాలు బాగా నేర్వు 
ఇనసొంపుగ  నీవు పాడ 
హాయిగా నిదురోతా. "అమ్మా

కామెంట్‌లు