గళ్ళ గళ్ళ చీర; -VT రాజగోపాలన్ మైసూరు 9940013300
గళ్ళ గళ్ళ చీర కట్టి 
ఘల్లు ఘల్లు గజ్జెలు కట్టి 
మావ కోసం నీ హొయలు 
మత్తెక్కి పోనాదే... "గళ్ళ"

ముంత నిండా పాలు తెచ్చి 
గొంతుదాకా తాపిచ్చి 
నా పై నీ ప్రేమ పిచ్చి 
మరువలేనే నా సింగీ.. "గళ్ళ"

చేతికేమో గాజులెట్టి 
నెత్తినేమో బొట్టు పెట్టి 
కొప్పులోన ఆకులెట్టి 
నా వైపు కన్ను కొట్టి.... "గళ్ళ"

నా మనసంతా లాగేశావే 
చూపుల్తో చంపేశావే 
రేతి రొస్తా నా సింగీ 
వెన్నెల్లో మంచమేయే... "గళ్ళ"

మావోయ్... 
ఇట్టా ఆశలేమో పెట్టుకోకు 
ఆరునెలల దాక రాకు 
అందమైన బుడ్డోడికి 
ఐదేండ్లు పూర్తి కానీ... "గళ్ళ"

కామెంట్‌లు