*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౮ - 058)*
 *సుజన పద్ధతి*
ఉత్పలమాల:
*నీరముతప్తలోహమున నిల్చి యనామక మైనశించు, నా*
*నీరమె ముత్యమట్లు నళి నీదళసంస్థితమై తనర్చు, నా*
*నీరమె శుక్తలోఁబడి మ ణిత్వముఁగాంచు సమంచితప్రభం; బౌ*
*రుషవృత్తు లిట్లధము మద్యము నుత్తముఁగొల్చువారికిన్.!*
*తా:*
కాలిన ఇనుము మీద పడిన నీటి బొట్టు ఆవిరి అయి కనబడకుండా పోతుంది. అదేనీటి బిందువు తామరాకు మీద పడితే ముత్యము లాగా మెరిసి పోతుంది. అదే నీటి బిందువు సముద్రంలో ముత్యపు చిప్పలో పడితే ముత్యముగా మారి ఖ్యాతి పొందుతుంది. అలాగే ఆశ్రమ ధరగమాలను పాటించే వారు కూడా అధములు, మధ్యములు, ఉత్తములుగా విభజించ బెడతారు......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ఈ పద్యం లో వేరెవరూ చెప్పడానికి ఏమీ మిగల్చలేదు, మన ఏనుగు లక్ష్మణ కవి. అరటి పండు ఒలిచి మిక్సీలో వేసి ఇచ్చారు. ఇటువంటి మంచి పద్యాలు లెక్కు మిక్కిలి చదువుకుని, భావార్ధ సహితంగా తెలుసుకుని ఆచరించే సద్బుద్ధిని పరాత్పరుడు మనకు ఇవ్వాలని, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్థిస్తూ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు