"నీ జ్ఞాపకం నాతోనే" 1980(ధారావాహిక 24,వ భాగం)- "నాగమణి రావులపాటి "
 ఆశలు నిండిన వేసవిలో చిగురులు వేసిన మనసు
తపనల తాపానికి  తనువు తహతహ లాడగా
గోదారి గలగలలు సవ్వడులు మనసుకు తాకి 
విరహ తుంపరల చక్కిలి గింతలు చెక్కిలి చేరిన
చక్కని చుక్కలా చిగురుటాకులా వణికిన సుమ
కుసుమం రాహుల్ తలపుల వలపులు అలుపులతో  మెలికెల మలుపులు మదిని మీటగా  క్షణమొక
యుగమై గడుపుతోంది రోజులు గంటలు  లెక్క
పెడుతూ రాహుల్ రాకకై ఎదురు చూస్తోంది కుసుమ.... .!!
కానీ కాలమనే కాలచక్రం కంటికి కనిపించకుండా
కదులుతూ మనిషి మనుగడపై కొరడా విసురుతుందీ
అనడంలో ఏమాత్రం సంశయం లేదు.....!
ఎంతో అందంగా సాగిపోయే ప్రేమ నౌక ముంచు
కొచ్చే తుఫానులో మునిగి పోయే సంఘటన..‌...!
తల్లి చాటు బిడ్డగా తల్లి ఆలనలో  తండ్రి పాలనలో
జీవితం ప్రేమ అనే సాగరంలో ఈదుతూ సాగర
సంగమంలో కలిసి పోయి ఆనంద కలల కౌగిలిలో
కరిగి పోవాలని కలలుకన్న సుకుమారి కుసుమకు
కనుల ముందు శూన్యం ఒక్కసారిగా చీకటి నిండిన
విషాద మేఘాలు కమ్ముకుని ఉక్కిరి బిక్కిరి చేయగా
ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో తెలియక ఏదో ఒక
దారిలో నడకల పరుగుతో దారీ తెన్నూ తెలియక 
సాగే ఆమె పయనం ఏదరికో?............
పాఠక మహాశయులకు కుసుమను కమ్ముకున్న
చీకట్లు ఏమిటి ? వాటిని ఎలా ఎదుర్కొని మనుగడ
సాగిస్తుంది ఇంత చిన్న వయసులో తాను ఎత్తుకునే
బరువు బాధ్యతలు ఏమిటి ? రాహుల్ కుసుమలు
కలుస్తారా వాళ్ళ ప్రేమకు కాలం ఇచ్చే బహుమతి
ఏమిటి? ఇత్యాదులు ముందు ముందు తెలుసు
కుంటారు కుసుమను చిన్న చూపు చూడకండి
మీ అభిమానం కామెంట్ రూపంలో తెలియజేయ
గలరని మనవి ................!!

కామెంట్‌లు