ఏం"నీ జ్జాపకం నాతోనే" 1980( ధారావాహికం,25,వ భాగం),"నాగమణి రావులపాటి "
 మిన్ను విరిగి మీద పడినా బాగుండేది...!
సునామీ వచ్చి తనలో కలిపేసుకున్నా వరదల్లో
కొట్టుకు పోయినా బాగుండు ఎడారిలో దిక్కు
తోచక దాహంతో ఎండలో మాడిపోయినా బాగుండు
మంచు కొండల్లో గడ్డకట్టిన శిలగా మారినా  కార్చిచ్చులో కాలి బూడిదగా మిగిలినా బాగుండు
కానీ కానీ జీవితమనే సుడిగుండంలో ఎటూ పోలేక
తలకు మించిన బరువూ బాద్యతలను బుజాన 
వేసుకుని చస్తూ బ్రతుకూతూ బాధలూ బంధాలను
బుజాన వేసుకుని దారీ తెన్నూ తెలియని ప్రయాణం
మనసు వికలమై బ్రతుకు భారమై జీవశ్చవంగా
మారిన తన జీవితానికి ముగింపు లేని ప్రశ్నగా 
మారింది కుసుమ జీవనం..........!!
ఆశల సౌధం కూలింది ప్రేమ నౌక మునిగింది 
ప్రస్తుతం చెల్లి తమ్ముడు కనుల ముందు మిగిలారు
భయంతో బాధతో ఉలికి పాటతో అక్క కుసుమ
చెరొక చేయీ పట్టుకుని చుట్టేసారు తన కళ్ళకు
ఇంకేమీ కనిపించట్లేదు పేగు పంచుకున్న బంధాన్ని జోలెలుగా చేసి మెడలో వేసుకుంది అక్కున
చేర్చుకుంది గుండెను రాయిగా చేసుకుంది 
నేనున్నాను అని వారికి ధైర్యంగా నిలిచింది
తనకంటూ ఏదీ లేదు చెల్లీ తమ్ముడు వారికి 
తోడుగా నీడగా కొండంత అండగా వారి  భవితకు పునాదై నిలిచింది తన జీవితాన్ని సమాధిగా
మార్చింది కుసుమ కటువుగా.........!!
వర్తమానం లోకి వెళితే రాహుల్  విజయవాడ
జాబ్ లో జాయిన్ కావటానికి వెళ్ళాడు
గీత వాళ్ళు నానమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఒక
పది రోజులు ఆమె దగ్గర  వుండాలని వెళ్ళింది
ఇంతలో కుసుమావాళ్ళ దగ్గరి బంధువుల వారి
 పిల్లవాడికి వడుగు చేస్తున్నారని కబురు చేస్తే
కలిసి బిక్ష వేసి త్వరగా వచ్చేస్తాము అని బండి
మీద అమ్మా నాన్న   వెళ్ళారు కానీ వారికి తెలియదు
అదే తమరి ఆఖరు చూపు అవుతుందని.‌....!!
దిక్కులు పిక్కటిల్లాయో ఏమో తెలియదు నక్కలు
ఊళవేసి వుండవచ్చు ఆకాశంలో రాబందు
మృత్యు బంధువులకు స్వాగతం పలుకుతూ
విహారయాత్ర చేసి వుండవచ్చు చిరు జల్లుల వాన
నిలువెల్లా స్నానం చేయించి పరలోకానికి పంపు
తున్నాదా అన్నట్టు జోరు వానలో ఎక్కడా నిలువ
నీడ లేని నిరామయం...! రోడ్డుకు ఇరువైపులా వున్న
చెట్లూ చేమలే సాక్ష్యాలు ...!ఇద్దరి మనసులల్లో ఏదో
తెలియని భయం మెరుపులు ఉరుములూ పిడుగులూ ఒక్క నిమిషం భయానక వాతావరణం
నడుమ వెనుకనుంచి వచ్చే మృత్యు శకటం ...!అంతే
బండిని బలంగా గుద్దేసి తన పని ముగిసింది
అన్నట్టు వెళ్ళిపోయింది...! బార్యా భర్తలు తలో దిక్కూ దిక్కులేని వారై పడిపోగా భర్తకు తొందర 
ఎక్కువై మరణాన్ని కౌగిలించుకోగా..! 
బార్యా చావలేక బ్రతకలేక కొన ఊపిరితో
 కడుపు తీపి దనాన్ని కడసారి చూడాలి
 అన్నట్టు మిణుకు మిణుకు దీపమై పడివుంది
ఒక చెట్టునీడన సేదదీరుతూ ..........‌!!
ఆ విషయం తెలుసుకున్న కుసుమ తోడ  బుట్టిన
వారితో పరుగులు తీసింది తండ్రి భయానక నిస్తేజం
తల్లి కనులలో మమకారాల నీటి చారికలు అమ్మా
అంటూ ఒడిలోకి తీసుకుంది ఏమీ కాదమ్మా నీకు
నేను వున్నాను నువ్వు బ్రతకాలి అమ్మా అని విలపిస్తూ.............!!
వలవలా ఏడ్చింది కుసుమ ఆమె కన్నీటి బిందువులు
తల్లి మోముపై బడి మూసుకు పోయే కనులను 
బలవంతంగా పైకి లేపి శక్తి లేని చేతుల జోలికి పోక
కనుల సైగలతోనే మిగిలిన కొడుకూ కూతురును
తదేకంగా చూసి కుసుమ పై చూపు ఆపింది
ఇంకా చలనం లేని ఆ కనులు చూపు మరల్చలేదు
ఉలుకూ పలుకూ లేదు అమ్మా అమ్మా అనే పిలుపు
గాలిలో కలిసి శూన్యంలో కలిసాయి? (సశేషం)
బరువెక్కిన హృదయంతో మళ్ళీ రేపు కలుస్తాను

కామెంట్‌లు